Is BJP Trying to Control YS Jagan? Shivraj Singh Chouhan’s AP Remarks Raise Questions

The News తెలుగు

The News తెలుగు

8,302 views

వైఎస్ జగన్ ను బీజేపీ కంట్రోల్ చేస్తోందా, శివరాజ్‌ సింగ్ చౌహాన్ మాటల మర్మమేంటి

దిల్లీ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. మోదీ ప్రభుత్వం ఒత్తిడిలో ఉంది. గడిచిన నెల రోజులుగా మోదీ పీఆర్ టీమ్ పెద్దగా ప్రభావితం చేయలేకపోతోంది. ఆయన కార్యక్రమాలు కూడా ఆశించినంతగా కనిపించడం లేదు. దాంతో బీజేపీ తన మిత్రులు చేజారిపోకూడదన్న సంకల్పంతో ఉంది. అదే సమయంలో పరోక్షంగా సహకరించే సెక్షన్ కూడా దాటిపోకూడదన్న ఉద్దేశంతో కనిపిస్తోంది. ఏపీలో కేంద్రమంత్రుల వరుస పర్యటనలు అందుకు సాక్ష్యంగా చూడొచ్చు.

నిర్మలా సీతారామన్ తర్వాత శివరాజ్ సింగ్ చౌహాన్ ఏపీలో పర్యటించారు. బుర్రిపాలెం సభ వేదికగా కేంద్రంలో బీజేపీ కీలక నేతల్లో ఒకరైనా ఆయన మాటలు ఆసక్తికరం. జగన్ మీద విమర్శలు విశేషంగా చూడాల్సి ఉంటుంది. రాజకీయంగా జగన్ ని కంట్రోల్ చేసేందుకు తగ్గట్టుగా బీజేపీ నాయకత్వం దాడి పెంచిందన్న అనుమానం ఉంది. అదే సమయంలో జగన్ మీద విమర్శల ట్వీట్ ను శివరాజ్ సింగ్ తొలగించడం కూడా గమనార్హం.

దానికి ముందే నిర్మలా సీతారామన్ పర్యటన సందర్భంగా మదపనల్లె పరిణామాల మీద జైరాం రమేశ్ ట్వీట్ టీడీపీ నేతలకు ఆగ్రహం కలిగించింది. జగన్ మీద బీజేపీ విమర్శలు చేస్తే, ఏపీలో కూటమి మీద కాంగ్రెస్ కస్సుమనడం విశేషం.

ఈసీఐ వివాదం చల్లారడం లేదు. సీఈసీని సాగనంపాల్సిందేనన్న వాదన బలపడుతోంది. ఎస్ఐఆర్, ఈవీఎం వంటి అంశాలు దుమారం రేపుతున్నాయి. జెన్ జీ ఉద్యమం సాగుతోంది. 10నాడు సీజేపీ ఛలో దిల్లీ జరుగుతుంది. ఈ లోగా కాంగ్రెస్, ఇతర విపక్షాలు 7న ఈసీ ఆఫీస్ ముట్టడికి పిలుపునిచ్చాయి.

చింతమనేని ప్రభాకర్ తీరు టీడీపీకి తలనొప్పులు తెస్తోంది. దెందులూరు నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా ఉన్న ఆయన టిప్పర్ల వ్యవహారం రాజకీయంగా దుమారం రేపింది. ఓవైపు తిరువూరు, రెండోవైపు దెందులూరు అన్నట్టుగా మారింది.

ఏపీలో స్థానిక ఎన్నికలను మార్చి లోగా నిర్వహించాల్సి ఉంది. లేదంటే కేంద్ర ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయే ప్రమాదముంది. బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వ పిటీషన్ సుప్రీంకోర్ట్ ముందుకు రాబోతోంది. ఏపీలో బీపీసీఎల్ నిర్మాణానికి ఎన్విరాన్ మెంట్ క్లియరెన్స్ వచ్చింది. ఆర్బీఐ రెపో రేటు పెంచబోతోంది.