గురువు గారికి హృదయపూర్వక నమస్సుమాంజలులు🙏🏻.తమరు దాదాపు 15 సంవత్సరములకు పూర్వము భద్రాచలం సీతారాముల కళ్యాణం (శ్రీరామ నవమి) సందర్భంగా విచ్చేసారు. అట్టి సందర్భంగా నేను ఉడతాభక్తిగా తమ కారు ఎక్కడ పార్క్ చేశారో తెలుకునే ప్రయత్నం చేసి చివరకు తమకు తెలియ జేశాను. ఈలోగా తమరిని చాలామంది చుట్టుముట్టి ఒక జర్నలిస్ట్ ఇంటికి తోడ్కొని వెళ్ళారు. అక్కడ అందరూ ఎన్నో విషయాలు తమరిని అడిగి తెలుసుకుంటున్నారు. ఇక నేను ఎక్కడో వెనకాల దూరంగా ఉండి వింటున్నాను. దాదాపు అర్ధగంట గడిచింది. ఇక నేను వెళ్ళాలని అనుకుంటున్న తరుణంలో తమరు నా గురించి ముందు వరసలో ఉన్నవారిని అడుగుతున్నారు. అది గమనించి నేను తమ ముందుకు వచ్చాను. తమరు నా పేరు అడుగగా నేను చెప్పడం జరిగింది. అప్పుడు తమ నోటినుండి వెలువడిన అమృత తుల్యమైన పలుకులు ఇలా ఉన్నాయి " ముక్తి తనఇంటి పేరుగా ముక్తినొసగ భాస్కరుండనుపేరు ఆభాస్కరునిది రామచంద్రుని వంశ సంరక్షకునిది అతడుయిదుగాక ఐశ్వర్యహాయనముల" ఇట్లు, తమ విశ్వాస పాత్రుడు ముక్తి భాస్కర్ రావు.
భావం ఎవరి స్వరప్రతిభ, విద్య, చాతుర్యమో కాలానుగుణంగా ఒక మాయలాగా కనిపిస్తుంది. కొందరు నవ్వులు, ప్రశంసలు, గోలలతో సభలను నింపుతారు; అయితే అందులో ప్రత్యేకత ఎంతవరకు ఉందో ప్రశ్నార్థకమే. వేగంగా వచ్చే కీర్తి, ప్రచారం, ఆడంబరాలవైపు చూపులు మళ్లుతుంటాయి. కానీ నిజమైన సాహిత్యంలో చిన్న రవ్వ వంటి పద్యమైనా, గద్యమైనా భావగర్భితమై రమణీయతను ప్రసరింపజేస్తుంది. ****
Madhuramu vari Leealalu Amoghamu